- బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
- పీఓడబ్ల్యూ, పీవైఎల్, పీ డీ ఎస్ యూ సంఘాల నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లును, మత్తు పానీయాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు,పివైఎల్, పిఓడబ్ల్యు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ, పీవైఎల్, పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు కే.సంధ్యారాణి, డి.నవీన్ కుమార్, డాక్టర్ కర్క గణేష్, లు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాలలో కూడా డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకడం బాధాకరమన్నారు. విద్యార్థులు యువత ప్రజలు డ్రగ్స్ కల్తీకల్లు మత్తు పానీయాలు అలవాటు పడి అవి లేకుంటే మానసికంగా పిచ్చోళ్ళు అవుతున్నా సందర్భాలు జిల్లాలో ఉన్నాయన్నారు. అటువంటి సంఘటనలను ద్వారనైన జిల్లా అధికారులు ఉత్పత్తి కేంద్రాలపై దాడులు జరపకుండా కల్తీకలను నివారించకుండా విచ్చలవిడిగా హల్లు డిపోలను పర్మిషన్ ఇవ్వడం కోట్ల రూపాయలు దండుకుంటూ అటు ప్రజలను నాశనం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. త్రాగడానికి తాగునీరు లేకున్నా మద్యం ఏరులై పారుతుందనీ, ప్రజలను మత్తులో ఉంచే విధంగా జిల్లా అధికారులు పాలకులు యదేచ్చగా బెల్టు షాపులకు పర్మిషన్ ఇవ్వడం ప్రతి సంవత్సరము బెల్టు షాపుల సంఖ్య పెరగడం,ప్రజలు మానసికంగా శారీరకంగా ఎదగనీయకుండా జీవచ్ఛవాలుగా చేయడం దుర్మార్గమన్నారు. చెప్పేది ఒకటి చేసేది ఒకటే అనే చందంగా పాలకవర్గ నాయకులు జిల్లా అధికారులు కల్తీకల్లు మాఫియా పై మద్యం మాఫియా పై డ్రగ్స్ మాఫియా పై ఎందుకు కఠిన చర్యలు చేపడతాలేరని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని వీడనాడాలని డిమాండ్ చేశారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు మద్యం,డ్రగ్స్ కు దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు అమూల్య కీర్తన, పీ డీ ఎస్ యూ జిల్లా నాయకులు సృజన్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
