28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కేసీఆర్‌ను ట్రంప్‌తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల అమెరికాకే నష్టం జరుగుతునందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్ సంస్థలతో మాట్లాడుతానన్నారు. అమెరికా కాదంటున్న సంస్థలు తెలంగాణకు రావాలని కోరారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు.. తెలంగాణ ప్రజలు ట్రంప్‌ను పక్కన పడేశారు అని అన్నారు. ఇష్టారాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్ళు ఎవరైనా ట్రంప్ అవుతారని తెలిపారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే, మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదని పేర్కొన్నారు. అక్కడి సంస్థలు అమెరికా వదిలి తెలంగాణకు రావాలని కోరారు. అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణకు రండి పెట్టుబడులు పెట్టండి అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

More articles

Latest article