24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బాసర రైల్వే స్టేషన్ లో ఫిట్స్ తో ఒకరి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బాసర, బతుకమ్మ:  నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పల్లికి చెందిన రావుసాబ్ అనే వ్యక్తి ఫిట్స్ రావడంతో బాసర రైల్వే స్టేషన్ లో మృతి చెందాడు. పండరీపూర్ విఠలేశ్వరుని ఆలయానికి వెళ్లేందుకు ఈనెల 22వ తేదీన రాత్రి 9గంటలకు భార్య సవితతో కలిసి బాసర రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అప్పటికే జ్వరంతో బాధపడుతున్న రావుసాబ్ కు రైల్వే స్టేషన్ లో ఫిట్స్ రావడంతో పడిపోయాడు. 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న సిబ్బంది రావుసాబ్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.

More articles

Latest article