- నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజాం నిరంకుశ పాలనలో తమ మాన, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారు చూపిన బాటలో సాగుదామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలిపారు. గురువారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విమోచన దినోత్సవం మూడవరోజు(చివరి రోజు) ఛాయాచిత్ర ప్రదర్శనకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ….. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. హైదరాబాద్ లిబరేషన్ లో పోరాడిన నాయకులు

ఎవరు, తదితర అంశాలను ఫొటో ఎగ్జిబిషన్‌లో కలవన్నారు. అప్పట్లో జరిగిన వివిధ సంఘటనలు ఫోటో ఎగ్జిబిషన్ లో తెలియజేయడం అభినందించ విషయం అన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు పోరాడిన రామ్ జి గోండు, కుమురం భీమ్, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి, భాగ్యరెడ్డి వర్మ, కోదాటి నారాయణరావు, వందేమాతరం రామచంద్రరావు, తదితరుల ప్రముఖుల ఫొటోలను ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా స్వచ్ఛభారత్ భాగంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్ మోహన్ రెడ్డి, కళాశాల పిఆర్ ఓ డాక్టర్ దండు స్వామి, లెఫ్ట్నెంట్ ఎన్ సిసి ఆఫీసర్ ఎం రామస్వామి, సీబీసీ ఏపీఏ రషిద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

