28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దేవాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

  • పాల్గొన్న బిజెపి నాయకులు, కార్యకర్తలు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ :భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని( సేవాపక్షం) కార్యక్రమాలలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ మండల శాఖ  ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించిన నుండి పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పట్టణాలు, పల్లెలు గ్రామాలు స్వచ్ఛభారత్ తో పరిశుభ్రతతో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి, జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి దాసరి గణేష్,ఉపాధ్యక్షులు బాలగౌడ్,ఉడుగుల యాదగిరి, కమ్మరి ఆంజనేయులు,మానుక కుమార్ యాదవ్,మారవేణి రంజిత్, కిరణ్ నాయక్,నిమ్మల సత్యం,సాగర్,చరణ్ రామ్ రెడ్డి, రాజు యాదవ్,గణేష్ నాయక్,రమేష్,కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

BJP-led Swachh Bharat programme at temple

More articles

Latest article