. పోటీలను ప్రారంభించిన డీఎస్ సోదరుడు సురేందర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో మాజీ మంత్రి డీఎస్(ధర్మపురి శ్రీనివాస్) స్మారక క్రీడాపోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడాపోటీలను డీఎస్ సోదరుడు, సొసైటీ ప్రతినిధి ధర్మపురి సురేందర్ ప్రారంభించారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేశారు. నిజామాబాద్ నగర తొలి మేయర్, నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ నేతృత్వంలో క్రీడాపోటీలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 పాఠశాలలు, జూనియర్ కళాశాల ల క్రీడాకారులు పాల్గొననున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్ అంశాల్లో పోటీలు జరగనున్నాయి. మొదటి రెండు స్థానాల్లో గెలుపొందిన వారికీ నగదు ప్రోత్సాహకంతోపాటు వ్యక్తిగత బహుమతులు అందించారు. అలాగే క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులందరికి మధ్యాహ్నం భోజనం వసతి కల్పించారు.
