అట్టహాసంగా ప్రారంభమైన డీఎస్ స్మారక క్రీడలు
. పోటీలను ప్రారంభించిన డీఎస్ సోదరుడు సురేందర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో మాజీ మంత్రి డీఎస్(ధర్మపురి శ్రీనివాస్) స్మారక క్రీడాపోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడాపోటీలను డీఎస్ సోదరుడు, సొసైటీ ప్రతినిధి ధర్మపురి సురేందర్ ప్రారంభించారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేశారు. నిజామాబాద్ నగర తొలి మేయర్, నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ నేతృత్వంలో క్రీడాపోటీలు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా...