25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

బీఆర్ ఎస్ కు ఝలక్

Must read

📰 Generate e-Paper Clip

. ఎంఐఎం గూటికి చేరిన బీఆర్ ఎస్ మైనార్టీ కీలక లీడర్లు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: బీఆర్ ఎస్ మైనార్టీ విభాగంలో కీలకంగా వ్యవహరించిన లీడర్లు ఎంఐఎం గూటికి చేరారు. జిల్లా కేంద్రానికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ, వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఫయాజ్, పార్టీ నాయకుడు అమర్ ఫారూఖ్ ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షకీల్, భైంసా మున్సిపల్ చైర్మన్ జావెద్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ ఆధ్వర్యంలో ముగ్గురు నాయకులు హైదరాబాద్ లో దారుల్ సలాంలో ఎంఐఎం కండువా కప్పుకున్నారు. ముగ్గురు కీలక మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ ను వీడడం  ఆ పార్టీకి పెద్ద దెబ్బ అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారు అసద్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి, మలక్ పేట్ ఎమ్మెల్యే హైమద్ బలాల, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Jhalak to BRS

More articles

Latest article