. ప్రధాన కాలువకు 100 క్యూసెక్కులు
జుక్కల్, బతుకమ్మ : కౌలస్ నాలా ప్రాజెక్టులోకి 377 క్యూసెక్కలు ఇన్ ఫ్లో వస్తోందని ప్రాజెక్ట్ ఏఈ రవిశంకర్ తెలిపారు. ఒక గేటు ద్వారా 288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, అలాగే ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని పంటలకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.237 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.225 టీఎంసీల నీరు నిలువ ఉందని తెలిపారు. 1.225 టీఎంసీలు నీరు నిలువ ఉందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 388 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
