27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వారెంట్ ఇష్యూ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు హైకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా లోని మిడ్ మానేరు లో తన ఇంటిని కోల్పోయిన చీర్లవంచకు చెందిన నిర్వాసితుడు  వేల్పుల ఎల్లయ్యకు అధికారులు నష్ట పరిహారం చెల్లించకపోవడంతో కోర్డును ఆశ్రయించారు. ఎల్లయ్య కు పరిహారం చెల్లించాలని గత జూన్ లో హైకోర్టు తీర్పు వెల్లడించింది. పరిహారం చెల్లించకపోవడమే కాకుండా కోర్టుకు జిల్లా కలెక్టర్ హాజరు కాలేదు. బుధవారం హాజరుకావాల్సి ఉండగా, గైర్హాజరు అవ్వడమే కాకుండా ఎలాంటి రిప్లై రాకపోవడంతో  న్యాయమూర్తి కలెక్టర్ కు వారెంట్ ఇష్యూ చేసినట్లు పిటిషనరు తరపు న్యాయవాది బొమ్మేన అర్జున్ రావు తెలిపారు.

More articles

Latest article