24.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని, పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ అన్నారు.  తెలంగాణ నూతన విద్యా విధానంపై ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు.  విద్యా విధానం లో సమూల మార్పులు,ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  నూతన విద్య పాలసీతో  విద్యా విధానం లో మార్పు లతో పాటు పేదరిక నిర్మూలన జరగాలన్నారు. గతంలో తెలంగాణ విద్య లో ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయన్నారు.  ఓపెన్ మార్కెట్ కారణం గా అంతర్జాతీయ స్థాయి కి మన విద్యా విధానం సరితూగడం లేదన్నారు.  ప్రతి సంవత్సరం 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నా.. వారి లో 15 శాతం మంది కి మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. విద్యా శాఖ కు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుందన్నారు. విద్యా విధానం లో సమూల మార్పులు తీసుకురావడంమే నా ధ్యేయమన్నారు. అందుకు కోసం కావాల్సిన సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరారు.  73 లక్షల మంది యువత కు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే తన లక్ష్యమన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దం గా పనిచేయాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో లోపాలు ఉన్నాయన్నారు.  విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్ ఆర్ బీ ఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రి ని కోరానని తెలిపారు. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలన్నారు. విద్య విషయం లో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయం గా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు.

More articles

Latest article