29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వందకు పైగా వీధి కుక్కల హతం

Must read

📰 Generate e-Paper Clip

  • పెంట కుర్థు గ్రామంలో ఘటన
  • స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు తో వెలుగులోకి
  • పంచాయతీ కార్యదర్శితో పాటు పరిశుద్ధ కార్మికులు, గ్రామస్తులపై కేసు
  • ఖననం చేసిన కుక్కల పోస్టుమార్టం

 

నిజామాబాద్, బతుకమ్మ  :  నిజామాబాద్ జిల్లా బోధన్ పెంటకూర్ధు క్యాంపు గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలో పలువురు వ్యక్తులను గ్రామ సింహాల కరువడం తో గ్రామస్తులు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గ్రామంలో సుమారు 50 మంది వరకు కరువడంతో 100 కు పైగా వీధి కుక్కలను గ్రామస్తులు తల కొంత  చందాలు వేసుకొని చంపినట్లు తెలిసింది. చనిపోయిన వాటిలో రెండు, మూడు పెంపుడు కుక్కలు ఉండడం తో వారు కరీంనగర్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.

తరుచూ వీధి కుక్కల దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు, కుక్కలను మత మార్చేందుకు విష ప్రయోగం చేసి చంపినట్టు తెలిసింది. కరీంనగర్ కు చెందిన ఓ ఎన్జీవోల కంప్లైంట్ తో కదిలిన బోధన్ పోలీసులు గ్రామపంచాయతీ కార్యదర్శి తో పాటు గ్రామ పారిశుద్ధ కార్మికులపై, గ్రామస్తులపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. అదే గ్రామంలో వీధి కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆనవాళ్లు వెలుగు చూసాయి. మూగ జీవాల సామూహిక హననం విషయం తెలుసుకున్న నాగార్జున భార్య, బ్లూ క్రాస్ సభ్యురాలు అమల రెండు రోజుల్లో గ్రామానికి రానున్నట్లు సమాచారం.

More than a hundred stray dogs killed

More articles

Latest article