హైదరాబాద్, బతుకమ్మ : నగరంలోని మణికొండలో విద్యుత్ ఏడీఈ అంబేడ్కర్ నివాసంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 15 చోట్ల ఏడీఈ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ ఈసోదాలు కొనసాగుతున్నాయి.
