27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా:  ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని మృతి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని సౌమ్యారెడ్డి మృతిచెందగా.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  మృతురాలి  సౌమ్యారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

 

More articles

Latest article