హైదరాబాద్, బతుకమ్మ : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డి మృతిచెందగా.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ ఓఆర్‌ఆర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సౌమ్యారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.