24 C
Hyderabad
Sunday, August 2, 2026

తల్లిని హత్య చేసిన కుమారుడి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : పిట్లం మండలంలో కన్నతల్లిని హత్య చేసిన కుమారుడిని, అతనికి సహకరించిన మరొకరిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలంలో గల బొల్లక్ గ్రామానికి చెందిన ఎర్రొళ్ల బాలయ్య, అతనికి సహకరించిన మరొకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈనెల 11న బొల్లక్ పల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పిట్లం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుర్తు తెలియని మహిళ ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈనెల 12న బోర్లం గ్రామ పెద్దలు ఎర్రొల్ల బాలయ్య, తన స్నేహితుడు కలిసి తల్లి సాయవ్వను హాస్పిటల్ కు తీసుకెళుతున్నట్లు చెప్పగా వారిని వాకబు చేశారు. దీంతో పెద్ద మనుషులకు హత్య జరిగిన విధానాన్ని వివరించాడు. ఎర్రళ్ల బాలయ్య తన తల్లి సాయవ్వ(77) ఆరోగ్యం బాగాలేదని, ఇంట్లొనే పడుకున్న దగ్గర మలమూత్ర విసర్జన చేస్తుంది. ఇంట్లో చూసుకోవడానికి ఎవరూ లేరని, ఇల్లు వాసన వస్తుందని చెప్పి ఈనెల 8న తన బైక్ పై బొల్లక్ పల్లి బ్రిడ్డి వద్దకు తీసుకెళ్లి బ్రిడ్జి మీది నుంచి మంజీరా నదిలో తోసేసి హత్య చేశామని తెలిపాడు. దీంతో గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యదు చేశారు. బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట చౌరస్తా వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును చేధించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, పిట్లం ఎస్ఐ వెంకట రావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.

More articles

Latest article