27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కిడ్స్ ఫ్యూచర్ స్కూల్లో బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :సంస్కార భారతి ఇందూరు మహానగర్ ఆధ్వర్యంలో కిడ్స్ ఫ్యూచర్ స్కూల్లో బతుకమ్మ పోస్టర్ తెలంగాణ ప్రాంత సహాయ కార్యదర్శి వేణుగోపాల్ ఆదివారం ఆవిష్కరించారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించే విధంగా మహిళా మణులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయాలని ఈనెల 21 నుంచి 30వ తేదీ లోపు వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలను మాతృ శక్తి కన్వీనర్ ఆధ్వర్యంలో నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత కార్యదర్శి గంటెల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కార్తీక్, కోశాధికారి రాధాకృష్ణ, రమణ చారి, కందకుర్తి ఆనంద్, అవన్ కుమార్, శివకుమార్, మధు చారి, మాతృశ్రీ కన్వీనర్ ఎస్.మాధురి, డి.వరలక్ష్మి, శ్రీలత, సంస్కార భారతి ఇందూరు కార్యకర్తలు పాల్గొన్నారు.

Bathukamma poster unveiled at Kids Future School

More articles

Latest article