25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

లోక్అదాలత్ కేసుల పరిష్కారంలో 4వ స్థానంలో నిజామాబాద్ జిల్లా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  జాతీయ మెగా లోక్-అదాలత్ కేసుల పరిష్కారంలో  నిజామాబాద్ జిల్లా 4వ స్థానంలో నిలిచిందని సీపీ సాయి చైతన్య తెలిపారు.  ఈఅదాలత్ లో 7444 కేసులను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.  సైబర్ నేరగాళ్ల  నుంచి  రూ. 42,45,273 లక్షలను తిరిగి బాధితులకు అందజేశామన్నారు. జిల్లాలో జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసినందుకు   అధికారులను, సిబ్బందిని సీపీ అభినందించారు.  ల్లా ప్రజలెవరైనా సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, http://cybercrime.gov.in పోర్టల్ నందు లాగిన్ అయి దరఖాస్తు చేయాలని సీపీ సూచించారు. ఈ సందర్భంగా జాతీయ మెగా లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు సైబర్ క్రైమ్  ఏసీపీ  వై. వెంకటేశ్వర్ రావ్ ,  సీఐ  ముఖిద్ పాషా , సీసీఆర్బీ సీఐ సతీష్ , కోర్ట్ డ్యూటీ , సైబర్ సెల్ సిబ్బందిని సీపీ అభినందించారు.

 

More articles

Latest article