డిచ్ పల్లి, బతుకమ్మ: డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన బుర్ర రాజేష్ గౌడ్ మరణించిన అనంతరం అవయవాలు మరొకరికి దానం వారి కుటుంబాన్ని అభినందించారు. ముందుగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేయడానికి వారి కుటుంబం ముందుకు రావడం ఎంతో కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రాజేష్ భార్య, తల్లిదండ్రులు మరియొక ప్రాణాలను కాపాడాలని అవయవాలు దానం చేయడానికి అంగీకరించినందుకు అభినందనీయమని అన్నారు. శనివారం రోజు బుర్ర రాజేష్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సంస్కరణ సభలో మాట్లాడుతూ ఈ రోజుల్లో చాలామంది బ్రెయిన్ డెడ్ వల్ల చనిపోతున్నారని, వారి కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేయడానికి అంగీకరిస్తే, అతని వల్ల మరొక ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారని అన్నారు.కండ్లు, కాలేయం, కిడ్నీలు,గుండె వంటి అవయవాలను దానం చేసి ఇతరులను కాపాడమే అన్నారు. ఎన్నో సంస్థలు అవయవ దానాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, సీనియర్ నాయకులు వాసు బాబు, ధర్మ గౌడ్, శ్యామ్ సన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

