26.2 C
Hyderabad
Monday, August 3, 2026

యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం

Must read

📰 Generate e-Paper Clip

  • మంత్రి వాకటి  శ్రీహరి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ కారణమని  తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ క్రీడలు, యువజన సర్వీసెస్ శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. నగరంలోని బైపాస్ లో గల  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రమంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడారు. రాష్ట్రానికి సరిపడంత యూరియా పంపకుండా కేంద్రం ద్రోహం చేస్తుందని, దీంతో తెలంగాణ రాష్ట్ర రైతుల అవస్థలు పడుతున్నారని, ఇప్పటివరకు రైతులకు  యూరియా సరిపడినంత పంపిణీ చేశామని, ఈ వర్షాకాలంలో పంటలు ఎక్కువగా పండిస్తున్న తరుణంలో యూరియా ఎక్కువ అవసరం ఉన్నందున కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, రైతులు కొంతమంది  స్టాక్ ఉంచుకోవడంతో ఇతర రైతులకు  దొరకడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని సిఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రతి సంక్షేమ పథకాలపై, నిధులపై, యూరియా సరఫరా ఫై  మాట్లాడడం జరిగిందని అన్నారు. ఈనెల 15 న నిర్వహించబోయే బీసీ డిక్లరేషన్  బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి వాకటి శ్రీహరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కట్టుబడిందని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. బీసీలు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బిసి రిజర్వేషన్ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం తెలుపలేదని, దీనిపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నట్లు మంత్రి శ్రీహరి  తెలిపారు. కామారెడ్డి లో నిర్వహించబోయే సభ ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటన చేస్తామని మంత్రి  వాకాటి తెలిపారు. జనాభా ప్రతిపాదన ప్రకారం రిజర్వేషన్ ఉండాలనేది రాహుల్ గాంధీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.రిజర్వేషన్ సాధించిన తర్వాతే సంస్థాగత  ఎన్నికలకు వెళ్తామని అన్నారు.  దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా చూస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి సర్కారు దీనికి అనుకూలంగా పనిచేస్తుందని, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నిర్వహించేందుకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించి స్థానిక సంస్థ ఎన్నికలకు వెళ్లాలని సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ పంపించమని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు  కల్పించి, బీసీలను రాజకీయంగా ఎదిగే విధంగా అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, డైరీ ఫాం కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్  తాహెర్ బిన్ హందన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఏఎంసీ చైర్మన్  ముప్పా గంగారెడ్డి, పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, అన్ని మండలాల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.

The central government is responsible for the urea shortage.

More articles

Latest article