కామారెడ్డి, బతుకమ్మ : పీడబ్ల్యూడీ నుంచి మంథని – దేవుని పల్లి రోడ్డును మంత్రి సీతక్క పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో క్రిందటి నెలలో కురిసినటువంటి భారీ వర్షాలకు గాను రోడ్లకు భారీ నష్టం జరిగినందున రోడ్ల పునరుద్ధరణ లో భాగంగా గురువారం తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా పాల్వంచ మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి మంథని దేవునిపల్లి వరకు గల రోడ్డును పరిశీలించారు. ఆమె వెంట గవర్నమెంట్ అడ్వైజర్ షబ్బీర్ అలీ, సి ఈ పి ఆర్.సమత, ఇందులో భాగంగా పిఆర్ ఈఈ దుర్గాప్రసాద్, డిప్యూటీ ఈ ఈ స్వామి దాసు ఉన్నారు.

