- జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంచార్జి మంత్రులు పర్యటనలు కాదు.. ఇందూరును అభివృద్ధి చేయండి అని జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. ఇందూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ సభ పేరుతో మైనార్టీ సభ నిర్వహించడం దురదృష్టకరం అన్నారు. వరద బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ ఏంటో ప్రజలకు అర్థం అయిందని తెలిపారు. వరద బాధితులకు కామారెడ్డిలో 11,500 రూపాయలు పంపిణీ చేశారు కానీ దాని కన్న ఎక్కువ నష్ట పోయిన సిరికొండ, దర్పల్లి, బీంగల్, వాడి, నడ్మి తండా, బీరప్ప తండా, కొండూరు, గడ్కోల్, ఒన్నాజిపేట, పెద్ద వల్గొట్, చిన్న వల్గొట్, సాలూర, నవీపేట్, రెంజల్ గ్రామాల్లో ప్రజలు అన్నీ కోల్పోయారని అన్నారు. అక్కడ ఎవరైనా బతికి ఉన్నారా లేదా అనే లెక్కలు కూడా ఏమైనా ఉన్నాయా లేదా ప్రజల బాధలు మీకు అక్కర లేదా మా రూరల్ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం, ఎమ్మెల్యే మాత్రం ఫొటో షూట్లలో మునిగిపోయరని ఎద్దేవా చేశారు. అతను డాక్టర్ వృత్తి మర్చిపోయి షూట్ లకు టైం కేటాయించడం సిగ్గు చేటని పేర్కొన్నారు. ఇందూరు జిల్లాలో ఎంత నష్టం జరిగిందో ఇక్కడ పర్యటిస్తున్న మంత్రులకు అవగాహన ఉన్నదా? వరద బాధితులకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మేము కోరినా, జిల్లా యంత్రాంగం స్పందించలేదని తెలిపారు. మా పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ జిల్లా ఐఎంఏ డాక్టర్ లతో మాట్లాడి హెల్త్ క్యాంపులు నిర్వహించానని తెలిపారు. కామారెడ్డిలో సభ కోసం మంత్రి సీతక్క కొన్ని రోజులుగా అక్కడే గడుపుతూ అన్ని ఏర్పాట్లు చేస్తుంది కానీ ప్రజల వద్దకు వెళ్లలేదని తెలిపారు. బాధితల కు న్యాయం చేయలేదు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అని పేర్కొన్నారు. బీసీల పేరుతో సభ పెట్టి మైనార్టీ ఓట్లు సాదించడమే వారి లక్ష్యం. జిల్లాలో 6 నియోజకవర్గాలకు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలు ఇంచార్జిగా లేరా? బీసీలను మోసం చేసే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే కాకుండా, ముదిరాజ్ బిడ్డ అయిన మంత్రి శ్రీధర్ రావు జిల్లా పర్యటనకు వస్తున్నారని, అభివృద్ధి కోసం కాదు ముఖ్యమంత్రి మోప్పు కోసం పర్యటన చేస్తున్నారన విమర్శించారు. మైనార్టీలను మినహాయించి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. దీని కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరుగుతున్న సభ బీసీలకు సంబంధం లేదన్నారు. అది పూర్తిగా మైనార్టీ సభ. అందువల్ల బలహీన వర్గాలు, బీసీ సంఘాలు ఆ సభకు దూరంగా ఉండాలని అ సభ ను బహిష్కరించాలని కోరారు. మహేష్ కుమార్ గౌడ్ ను సాకుగా చూపి బీసీలను నిండా ముంచుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీసీ ల వ్యతిరేకి కాంగ్రెస్ నాయకులు బిజెపి మీద మాట్లాడం మానుకోవాలని లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, కార్పొరేటర్లు ప్రమోద్, మాస్టర్ శంకర్,మల్లేష్ గుప్తా,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓం సింగ్, జిల్లా కార్యదర్శి దాంపల్లి జ్యోతి, జిల్లా మీడియా ఇంచార్జి పుట్ట వీరేందర్, జిల్లా కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, అంబదాస్, నాగరాజ్, హరీష్ రెడ్డి, సందీప్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
