- అది టీజీపీఎస్సీ కాదు టిపిసిసి కమిషన్
- టీజీపీఎస్సీను వెంటనే రద్దు చేయాలి
- కొత్త కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాతనే గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయాలి
- బిసి డిక్లరేషన్ కింద 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఉద్యోగుల చేపట్టాలి
- ఒక్కో ఉద్యోగానికి మూడు కోట్ల వసూలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి
- బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సబ్బని హరీష్
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బి ఆర్ ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సబ్బని హరీష్ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అన్యాయం కలిగించే విధంగా వ్యవహరించిన టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం పట్టింపులకు పోకుండా హైకోర్టు డివిజన్ బెంచికి, సుప్రీంకోర్టుకు వెళ్ళవద్దని అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.బీసీ విద్యార్థులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఉద్దేశం నియామకాల ప్రక్రియ చేపట్టాలన్నారు.ప్రజా పాలన అని మాట్లాడుతున్న కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులపై,నిరుద్యోగులపై తీవ్రమైన నిర్బంధాన్ని విధిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని చూస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని బి ఆర్ ఎస్ వి పక్షాన హెచ్చరిస్తున్నామన్నారు.
