26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అంబేడ్కర్ యువజన సంఘం మండల కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మోర్తాడ్ మండల నూతన కమిటీలను బుధవారం నియమించడం జరిగిందని బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి జనార్ధన్ అన్నారు. పదవులు చేపట్టిన ప్రతి ఒక్కరు అంకితభావంతో ప్రజా సమస్యలపై పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని పేర్కొన్నారు.  మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగుళి మాలజీ, ఉపాధ్యక్షులు దోన్ పాల్ రాములు, కొండ శివకుమార్, ప్రధాన కార్యదర్శి మామిడి రాజేందర్, జాయింట్ సెక్రెటరీ బండి సాగర్, చట్లపల్లి దేవారం, ప్రచారక కార్యదర్శి ఆరే అరుణ్ సలహాదారులు మామిడి లింగం పల్లెపాటే వీరయ్యలను ఎన్నిక చేసినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు లింగన్న, ఉపాధ్యక్షుడు జయ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article