26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రొవిజన్ స్టోర్ ముసుగు

Must read

📰 Generate e-Paper Clip

  • నిషేధిత మత్తు పదార్థాలు దందా
  • గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొవిజన్ స్టోర్ ( కిరాణా జనరల్ స్టోర్) నిర్వహణ ముసుగులో జరుగుతున్న నిషేధిత మత్తు పదార్థాల దందాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్టురట్టు చేశారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… నిజామాబాద్ నగరంలోని గోశాల రోడ్డులో నిషేధిత మత్తుపదార్థం అల్ఫ్రా జోలం రవాణా జరుగుతుందని విశ్వసనీయ సమాచారం అందింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం నగరంలోని గోశాల రోడ్డులో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో నిజామాబాద్ నగరంలోని కోజా కాలనీ కి చెందిన అబ్దుల్ మాలిక్ దేవాని అనే వ్యక్తి స్కూటీపై వస్తుండగా తనిఖీ చేశారు. అతని స్కూటీ డిక్కీలో నిషేధిత మత్తు పదార్థమైన అల్ఫ్రా జోలం 609 గ్రాముల కలిగిన దానిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని విలువ బహిరంగ మార్కెట్లో ఐదారులక్షలు ఉంటుందని తెలిపారు. సంబంధిత నిషేధిత మత్తు పదార్థాన్ని కృత్రిమ రసాయనాల తయారీ కల్తీకల్లు కోసం ఉపయోగిస్తారని తెలిపారు. అబ్దుల్ మాలిక్ దేవాని నగరంలో ప్రొవిజన్ స్టోర్ నిర్వహిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. అబ్దుల్ మాలిక్ దేవానిని అరెస్టు చేసి రిమాండ్ పంపుతామని సీఐ తెలిపారు. నిషేధిత మత్తుపదార్థం అబ్దుల్ మాలిక్ దేవాని ఎక్కడినుంచి తీసుకువచ్చి విక్రయాలు చేస్తున్నారని కోణంలో విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.  ఈ దాడిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రవికుమార్ తోపాటు హెడ్ కానిస్టేబుల్ లు రాజన్న,నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు హామీద్ శ్యాంసుందర్ శివ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article