26.6 C
Hyderabad
Monday, August 3, 2026

బాలికను తల్లిదండ్రులకు అప్పగింత

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణానికి చెందిన సాయిపల్లవి అనే నాలుగేళ్ల బాలిక మంగళవారం ఇంటికి వెళుతుండగా దారి తప్పింది. దీంతో పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని సిరిసిల్లా రోడ్డులోని యూనియన్ బ్యాంకు వద్ద దారి తెలియక అటూఇటూ తిరుగుతుంది. అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీకాంత్ గమనించి బాలికను కామారెడ్డి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అనంతరం స్టేషన్ ఎస్ఎచ్ఓ నరహరి సీసీ కెమెరాలు పరిశీలించి వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం పంచుకున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులను గుర్తించి సురక్షితంగా అప్పగించారు. జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర స్పందనాత్మకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు.

More articles

Latest article