29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పట్టణం శివాజీ నగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రధానోపాధ్యాయులు,  సభాధ్యక్షులుగా చందు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, మమత ,ప్రియాంక ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు గౌరవ అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్, గౌరవ అతిథిగా శ్రీధర్ స్వామి మాజీ ఉపాధ్యాయులు, మాజీ సైనికులు మాజీ బ్యాంకు ఉద్యోగి, ప్రత్యేక ఆహ్వానితులుగా దేవి సింగ్ విశ్రాంత వయోజన విద్య ఉపసంచాలకులు జిఎం శంకర్ విశ్రాంత సహాయ ప్రాజెక్టు అధికారి, అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొన్న  టీ.రమణ స్వామి, సమాజ సేవకులు చల్ల గంగాధర్ హాజరయ్యారు. తాటి వీరేశం టిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అక్షరాస్యత ఆవశ్యకత గురించి తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు గురించి తల్లిదండ్రుల సహకారం గురించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివరించారు.

International Literacy Day celebrations in full swing

More articles

Latest article