27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

క్రీడలతో మానసిక ఉల్లాసం

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లీ, బతుకమ్మ : క్రీడలు ఆడడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కావున ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని గురువుల దగ్గర తర్ఫీదు పొంది జాతీయస్థాయిలో రాణించాలని తెలియజేశారు. కమ్మర్పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో 69వ మండల స్థాయి పాఠశాలల క్రీడాత్సవాలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారుల వందనాన్ని స్వీకరించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన పాఠశాల విద్యార్థులకు ఆయన షీల్డ్ లు అందజేశారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mental well-being through sports

More articles

Latest article