26.3 C
Hyderabad
Monday, August 3, 2026

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట కలిగింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈసందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలకు వేదికలుగా మార్చవద్దని వ్యాఖ్యనించారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంపై తెలంగాణ బీజేపీ  ఈపిటిషన్ దాఖలు చేసింది. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని బీజేపీ పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. రూ.10 లక్షలు జరిమానా విధిస్తామని సీజేఐ హెచ్చరించారు.  గత నెలలో ఇదే విషయమై ఆ పార్టీవేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈఉత్తర్వులను తెలంగాణ బీజేపీ సుప్రీం కోర్టులో సవాల్ చేయడంతో కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.

More articles

Latest article