బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని సర్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చక్రేశ్వర శివాలయం నుండి ఘనంగా ప్రారంభమైన విఘ్నేశ్వరుని శోభాయాత్ర కనుల విందుగా కొనసాగింది. భక్తుల భారీ సమూహం రధాలతో గణనాథుని ప్రధాన వీధుల గుండా ఊరేగించింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ యువకులతో కలిసి డాన్స్ చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. బ్యాండ్ సంగీతానికి ఆయన వేసిన స్టెప్పులు యువతలో హర్షం రేకెత్తించాయి. శోభాయాత్రలో భక్తి, ఉత్సాహం, వినోదం సమపాళ్లలో అలరించాయి.
