బోధన్ కమిషనర్ స్టెప్పులతో శోభాయాత్రలో సందడి
బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని సర్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చక్రేశ్వర శివాలయం నుండి ఘనంగా ప్రారంభమైన విఘ్నేశ్వరుని శోభాయాత్ర కనుల విందుగా కొనసాగింది. భక్తుల భారీ సమూహం రధాలతో గణనాథుని ప్రధాన వీధుల గుండా ఊరేగించింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ యువకులతో కలిసి డాన్స్ చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. బ్యాండ్ సంగీతానికి ఆయన వేసిన స్టెప్పులు యువతలో హర్షం రేకెత్తించాయి. శోభాయాత్రలో భక్తి, ఉత్సాహం, వినోదం సమపాళ్లలో అలరించాయి. [video width="848" height="478" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/09/WhatsApp-Video-2025-09-07-at-6.33.30-PM.mp4"][/video]