26.6 C
Hyderabad
Monday, August 3, 2026

అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బోధన్ : బోధన్ రాకాసిపేట్ ప్రాంతంలో అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో సుమారు 300 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల కోసం ఈసీజీ, రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంఎస్ సుధాకర్ (ఆర్థోపెడిక్), డాక్టర్ షేక్ షావలి (ఎండి జనరల్ ఫిజీషియన్), డయాబెటిక్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ సభ్యులు మహమ్మద్ ఇఫ్తార్, సురేష్ నవీన్‌తో పాటు హాస్పిటల్ సిబ్బంది కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

More articles

Latest article