అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
బతుకమ్మ బోధన్ : బోధన్ రాకాసిపేట్ ప్రాంతంలో అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో సుమారు 300 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల కోసం ఈసీజీ, రక్తపరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంఎస్ సుధాకర్ (ఆర్థోపెడిక్), డాక్టర్ షేక్ షావలి (ఎండి జనరల్ ఫిజీషియన్), డయాబెటిక్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ సభ్యులు మహమ్మద్ ఇఫ్తార్, సురేష్ నవీన్‌తో పాటు హాస్పిటల్ సిబ్బంది...