23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీసు వాహనాన్ని ఢీకొన్న కారు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లంగర్ హౌస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని ఓ కారు వెనుక నుంచి ఢీకొంది. మద్యం మత్తులో ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కశ్వి (20) అనే యువతి అక్కడక్కడ మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ వాహనం లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article