26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పీసీసీ చీఫ్ ను కలిసిన ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మర్యాద పూర్వకంగా కలిశాయి. ఈ మధ్యనే తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీల నూతన కార్యవర్గం ఏర్పాటు అయ్యింది.  అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, కోశాధికారి శ్రీనివాస్ రాజు, ఉపాధ్యక్షులు అరుణ్ రెడ్డి, హకీం తదితరులు ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను నిజామాబాద్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… తమ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ సూర్యప్రకాశ్ రెడ్డి, దత్తు, గిరి, అనిల్, దేవారెడ్డి, శంకర్, రాజేశ్వర్, నవీన్, షకీల్, లక్ష్మారెడ్డి, దేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article