25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

15న కామారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి,  బతుకమ్మ : ఈనెల 15న కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ బహిరంగ  సభ  నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ను కామారెడ్డి వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ బహిరంగ సభకు  కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే,కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి,  కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య, మరియు జాతీయ రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు.  శనివారం పట్టణంలోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో బహిరంగ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో  రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ చార్జి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆదివారం పట్టణంలో ఇన్ చార్జి మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో  ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ఈసందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి శాసనసభ సమావేశాల్లో బిల్లు పై ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ కు పంపించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల ఆశలు నెరవేరుస్తూ ఎన్నికల్లో వారికి 42% రిజర్వేషన్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

More articles

Latest article