15న కామారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభ
కామారెడ్డి, బతుకమ్మ : ఈనెల 15న కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ను కామారెడ్డి వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే,కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య, మరియు జాతీయ రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో బహిరంగ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్...