29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

  • దేశ ప్రజలకు జీఎస్టీని  తగ్గించి దసరా దీపావళికి కానుక ఇచ్చిన మోడీ
  • బీజేపీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి

 

 బతుకమ్మ న్యూస్ ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువతకు, దేశంలోని అనేక వర్గాల ప్రజలకు తక్కువ ధరకు నిత్యవసర సరుకులు అందించాలని ఉద్దేశంతో జిఎస్టిని తగ్గించి భారత దేశ చరిత్రలో అతిపెద్ద పన్ను సంస్కరణలు  తెచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కి,ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి,ప్రధాన కార్యదర్శులు దాసరి గణేష్, నంది నరేష్,పట్టణ అధ్యక్షులు గంట బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బంధారపు లక్ష్మారెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, మండల కార్యదర్శి చింతల లహరి, జూనకంటి తేజశ్రీ,చీకట్ల ప్రమీల, మాలోత్ కిరణ్ నాయక్,సింగరవేణి కృష్ణ,కమ్మరి ఆంజనేయులు,వంగల రాజు,ప్రదీప్ రెడ్డి,మరవెని రంజిత్ కుమార్,బాల్ రెడ్డి, గాల్ రెడ్డి, పారుపల్లి సంజీవరెడ్డి, చరణ్, గొల్లపల్లి భాస్కర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article