నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గణపతి నవరాత్రుల సందర్బంగా నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ దర్శించుకొని ప్రత్యేక పూజలె చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు హిందూ ధర్మ సంస్కృతి, సంప్రదాయాల ఐక్యతే దేశ సమైక్యతకు మూలం అన్నారు. అందులో భాగంగానే ఇందూర్ జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. బలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ల స్ఫూర్తితో సనాతన హిందూ ధర్మ రక్షణకై యావత్ హిందూ సమాజాన్ని ఒకటి చేయడానికి యువతి, యువకులు చిన్నారులంతా కలిసి భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం హిందువులుగా గర్వించదగ్గ విషయం అన్నారు. హిందువుల ఐక్యత ఈ తొమ్మిది రోజులే కాకుండా భవిష్యత్ లో హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి ఎటువంటి ఆపద వచ్చిన హిందువులంత ఐక్యతతో జాయించాలి అన్నారు. హిందు దేవాలయాలపై హిందూవుల పై జరుగుతున్నా దాడులను హిందువులంత సంఘటితం అయ్యి ఎదుర్కోవాలని సూచించారు. అనంతరం పలు మండపాలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బట్టికిరి ఆనంద్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ, సతీష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

