కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా పట్టణంలో వాహనాల రాకపోకలకు తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయబడనున్నాయి. ప్రజలందరూ ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి, గణేష్ నిమజ్జనం శోభాయాత్ర విజయవంతంగా, అంగరంగ వైభవంగా జరగడానికి సహకరించాలని కామారెడ్డి పోలీసులు కోరారు.
- డైవర్షన్లు ఈ విధంగా ఉంటాయి:
- కరీంనగర్, సిరిసిల్ల వైపు నుండి కామారెడ్డి పట్టణంలోకి వచ్చే వాహనాలు – సిరిసిల్ల బైపాస్ ఎక్కి, NH-44 రోడ్డు నుండి టేక్రియాల్ బైపాస్ ద్వారా లోపలికి వచ్చి పట్టణంలోకి ప్రవేశించవచ్చును.
- కరీంనగర్, సిరిసిల్ల వైపు వెళ్లే వాహనాలు – న్యూ బస్టాండ్ నుండి ఇందిరాగాంధీ స్టేడియం, టేక్రియాల్ బైపాస్ మార్గంగా వెళ్లి, NH-44 నుండి సిరిసిల్ల బైపాస్ ద్వారా సిరిసిల్ల, కరీంనగర్ వైపు వెళ్లవచ్చును.
- కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలు– కొత్త బస్టాండ్ నుండి అశోక్ నగర్, రైల్వే గేట్ వరకు వచ్చి, అక్కడినుండి: మార్గం 1: కలెక్టర్ ఆఫీస్ నుంచి గుమస్తా కాలనీ, రామారెడ్డి వైపు వెళ్లవచ్చును. మార్గం 2: ఓం శాంతి భవనం నుండి రాజీవ్ నగర్, టీచర్స్ కాలనీ, ఇంద్రనగర్ కాలనీ వైపు వెళ్లవచ్చును.
- హైదరాబాద్ వైపు వెళ్లేవాహనాలు– యథావిధిగా పాత మార్గం ద్వారానే వెళ్లవచ్చును.
- హైదరాబాద్ వైపు నుండి పాతరాజంపేట వైపు నుండి కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశించేవాహనాలు– టేక్రియాల్ బైపాస్ వద్ద నుండి ఇందిరాగాంధీ స్టేడియం ముందుగా బస్టాండ్ చేరుకొని పట్టణంలోకి ప్రవేశించ వచ్చును. శుక్రవారం సాయంత్రం 6 గం.ల నుండి శనివారం శోభాయాత్ర ముగిసే వరకు భారీ వాహనధారులు కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశం వీలుపడదు.
- శోభాయాత్ర జరిగే మార్గంలో ఏలాంటి వాహనాలకు అనుమతి ఇవ్వబడదు.
- ఈ ట్రాఫిక్ డైవర్షన్లు శనివారం రాత్రి నిమజ్జనం పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయి.
