గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా పట్టణంలో వాహనాల రాకపోకలకు తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయబడనున్నాయి. ప్రజలందరూ ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి, గణేష్ నిమజ్జనం శోభాయాత్ర విజయవంతంగా, అంగరంగ వైభవంగా జరగడానికి సహకరించాలని కామారెడ్డి పోలీసులు కోరారు. డైవర్షన్లు ఈ విధంగా ఉంటాయి: కరీంనగర్, సిరిసిల్ల వైపు నుండి కామారెడ్డి పట్టణంలోకి వచ్చే వాహనాలు – సిరిసిల్ల బైపాస్ ఎక్కి, NH-44 రోడ్డు నుండి టేక్రియాల్...