29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని మాక్లూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రకాష్  అన్నారు. మాక్లూర్ మండలంలోని గుంజిలీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించాడు. సకాలంలో బిల్లుల వివరాల గురించి తెలుసుకున్నారు. ఇంద్రమ్మ లబ్ధిదారులకు పలు రకాల   సూచనలు తెలిపారు. అనంతరం చిక్లి గ్రామంలో రాజమణికి 60000 సీఎంఆర్ చెక్క అందజేశారు.ఈ కార్యక్రమంలో గుంజిలి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జైలు సింగ్,చామంతుల శ్రీనివాస్,ఎస్ కే సలీం, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article