29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

చెరువు వద్ద వ్యర్థాలను పడేస్తున్న వ్యాపారులు

Must read

📰 Generate e-Paper Clip

  • అధికారుల నిర్లక్ష్యం
  • ​ఎల్లయ్య చెరువు కాదు.. పట్టణ చెత్తతో నిండిన చెరువు

 

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలో అంగడి బజార్ వద్ద ఉన్న ఎల్లయ్య చెరువు చెత్తచెదారంతో నిండిపోయి డంపింగ్‌ యార్డుగ తలపిస్తోంది.ట్రాక్టర్లతో భవన శిథిలాలను, పలు వాణిజ్య సమూదాయాలకు చెందిన వ్యక్తులు, ప్రైవేటు సంస్థల వారు వ్యర్థాలను చెరువు సమీపంలోనే పడేస్తున్నారు. దీంతో మురుగు నీటితో చెరువు కలుషితమవుతోంది. అటుగా వెళ్లే వాహన చోదకులు భరించలేని కంపుతో ఇబ్బంది పడుతున్నారు.అంతేకాకుండా పరిసరాల్లో తీవ్రమైన దుర్వాసన వస్తోంది.ఈగలు,దోమలు,పందులు,వీధి కుక్కలకు ఆవాసంగా మారింది. అయితే చెరువు సమీపంలో చెత్త వేయరాదని ఎలాంటి సూచిక బోర్డులను ఏర్పాటు చేయకుండా మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఎల్లయ్య చెరువులో వ్యర్థాలు పారబోస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువు సమీపంలో చెత్తను వేయకూడని, సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. దీంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కూడా మారిందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి చెత్తాచెదారం,వ్యర్ధాల డంపింగ్ యార్డ్ కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Traders dumping waste at the pond

More articles

Latest article