చెరువు వద్ద వ్యర్థాలను పడేస్తున్న వ్యాపారులు
అధికారుల నిర్లక్ష్యం ఎల్లయ్య చెరువు కాదు.. పట్టణ చెత్తతో నిండిన చెరువు బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో అంగడి బజార్ వద్ద ఉన్న ఎల్లయ్య చెరువు చెత్తచెదారంతో నిండిపోయి డంపింగ్ యార్డుగ తలపిస్తోంది.ట్రాక్టర్లతో భవన శిథిలాలను, పలు వాణిజ్య సమూదాయాలకు చెందిన వ్యక్తులు, ప్రైవేటు సంస్థల వారు వ్యర్థాలను చెరువు సమీపంలోనే పడేస్తున్నారు. దీంతో మురుగు నీటితో చెరువు కలుషితమవుతోంది. అటుగా వెళ్లే వాహన చోదకులు భరించలేని కంపుతో ఇబ్బంది పడుతున్నారు.అంతేకాకుండా పరిసరాల్లో తీవ్రమైన దుర్వాసన వస్తోంది.ఈగలు,దోమలు,పందులు,వీధి కుక్కలకు ఆవాసంగా మారింది....