25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ 

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం కేసు విచారణకు సీబీఐకి లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సీబీఐని తెలంగాణలోకి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీ లేకుండా 2022లో ఇచ్చిన ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు జీవో జారీ చేసింది. కాళేశ్వరం కేసు వరకు సీబీఐకి సడలింపు ఇచ్చింది. కాగా,  కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల నిమిత్తం సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.

More articles

Latest article