23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

చూసి నేర్చుకున్నది మర్చిపోము

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : చదువుకునే విద్యార్థులు చూసి నేర్చుకోవడం ద్వారా ఏప్పటికీ మర్చిపోకుండా ప్రతి విషయం గుర్తుంటుందని సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు రాజేందర్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థులను సోమవారం ఫీల్డ్ ట్రిప్పుకు తీసుకెళ్లారు. స్థానికంగా ఉన్న ఎస్ బీ ఐ బ్యాంకుకు తీసుకెళ్లి మనీ అండ్ బ్యాంకింగ్ కు సంబంధించిన విషయాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. డబ్బులు ఏవిధంగా డిపాజిట్ చేయాలి. డబ్బులు తీసుకునేటప్పుడు ఓచర్ ఏ విధంగా రాయాలి. బ్యాంకులో ఉన్న అధికారుల గురించి, లాకర్ సంబంధించిన విషయాలను లోన్లకు సంబంధించిన విషయాలను తదితర విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు కూడా స్టూడెంట్ అకౌంట్ తీసుకొని డబ్బులు జమ చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలరావు, బ్యాంక్ సిబ్బంది, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Let's not forget what we have seen and learned.

More articles

Latest article