బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జనం ఈనెల 6న శనివారం నిర్వహించనున్నట్లు సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు మాసుల్ శ్రీనివాస్ ప్రకటించారు. 7న చంద్రగ్రహణం ఉండటంతో ముందురోజే నిమజ్జనం జరగనున్నట్లు తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు. గణేష్ శోభాయాత్ర సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 12:21 గంటలకు శ్రీ చక్కేర శివాలయం వద్ద నుంచి ఘనంగా ప్రారంభం కానందుని తెలియజేశారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు శివాలయం చైర్మన్ హరికాంత్ చారి మారుతి మందిర్ చైర్మన్ గుండేటి శంకర్ బీర్కూరు బుజ్జి రుద్ర సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ కిరణ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
