హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కుమారుడి చదువు నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె అమెరికా పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్ కు వచ్చారు. ఈసందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కల్వకుంట్ల కవితకు తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

