- ఆ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి
- రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : దేశవ్యాప్తంగా తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బిజెపి నేతలు, అనువిత వ్యాఖ్యలు చేస్తూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని భూపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఆగ్రనేత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పై ఈ నెల 11 నుంచి వరుసగా ఎన్డీఏ కు చెందిన కొందరు నేతలు ఇష్టరీతిన వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పట్టారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ఇతర ప్రజాకర్షణ కార్యక్రమాలను చేపడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే విధంగా ప్రజలకు దగ్గరవుతుంటే అది చూసి భయపడుతున్న బిజెపి నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ హత్యకు కుట్ర పన్నడం దారుణం అన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ జిల్లా నుండి తెలంగాణ డిజిపితో సహా నగరంలోని వన్ టౌన్ లో ఒక కాపీని, అదేవిధంగా సిపి కార్యాలయంలో ఒక కాపీని అందించి తమ నాయకులు రాహుల్ గాంధీ పై తప్పుగా మాట్లాడుతున్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేల పై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వారిపై పోలీసులు రాజా ద్రోహం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి వరుసగా రాహుల్ గాంధీ పై చేసిన అనైతిక వ్యాఖ్యలకు ఈ ఐదుగురు ముఖ్య నేతలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాగే వారి వెనుక ఉన్న వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రూరల్ ఎమ్మెల్యే పోలీసులను కోరారు. ఇలా వరుసగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడానికి చూస్తుంటే వారి వెనుక దేశ ప్రధాని హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో కిషన్ కేత్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
