27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కాళేశ్వరంపై సా.4 గంటలకు చర్చ : ఉత్తమ్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  కాళేశ్వరం కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టామని,  స్పీకర్‌ కాళేశ్వరం నివేదికను టేబుల్‌ చేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై సా.4 గంటలకు చర్చ ప్రారంభమవుతుందన్నారు. ఫ్లోర్ లీడర్లకు నివేదికకు సంబంధించిన హార్ట్ కాపీలు, సభ్యులకు సాఫ్ట్ కాపీలు ఇచ్చినట్లు చెప్పారు. రెండు గంటలు విరామం అనంతరం ప్రిపేర్ అయ్యాక చర్చిస్తామన్నారు. కేసీఆర్ తరపున నివేదికను హరీశ్ రావు కు ఇచ్చినట్లు పేర్కొన్నారు.  కోర్టు విషయాలపై మాట్లాడనని, అన్ని విషయాలు సభ్యులతోనే మాట్లాడుతామన్నారు.

కాళేశ్వరం నివేదికలో ఏముంది..?

మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించరాదని నిపుణుల కమిటీ పేర్కొంది

తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేనందున మేడిగడ్డ నిర్మించారనం సహేతుకం కాదు

నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిర్మాణం

ఆనకట్టల నిర్మాణానికి ఇచ్చిన కాంట్రాక్టు విధానం  సరిగా లేదు

డీపీఆర్ పూర్తిగా పరిశీలించకుండానే అంచనాలకు ఆమోదం

కాంట్రాక్టర్ల లబ్ధికే అంచనాల పెంపు నిబంధనలు

ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతుల్లోనూ లోపాలు

మూడు ఆనకట్టల ప్రణాళిక, నిర్మాణంలో పూర్తి తప్పిదాలు, అంచనాల తయారీ, పరిపాలన అనుమతుల్లో లోపాలున్నాయని పీసీ ఘో ష్ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది.

More articles

Latest article